Asianet News TeluguAsianet News Telugu

మాగుంట శ్రీనివాసులు, కేశినేని నానిలకు బంపర్ ఆఫర్: కీలక పదవులు కట్టబెట్టిన కేంద్రం

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలకు ఎస్టిమేట్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. ఎస్టిమేట్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 29 మంది ఎంపీలకు అవకాశం కల్పించింది కేంద్రం. అయితే వారిలో ఇద్దరు ఏపీకి చెందిన ఎంపీలు కావడం విశేషం. 
 
central government offer to telugu mps as estimate committee members
Author
New Delhi, First Published Jul 11, 2019, 11:01 AM IST

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులకు కీలక పదవులు కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్ లో ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఎంపీలకు కేంద్రం అవకాశం ఇచ్చింది. అందులో భాగంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలకు ఎస్టిమేట్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. ఎస్టిమేట్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 29 మంది ఎంపీలకు అవకాశం కల్పించింది కేంద్రం. అయితే వారిలో ఇద్దరు ఏపీకి చెందిన ఎంపీలు కావడం విశేషం. 

అయితే ఇప్పటి వరకు కేంద్రం ఆఫర్ చేసిన పదవులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తు వస్తోంది. కీలకమైన డిప్యూటీ స్పీకర్ పోస్టును సైతం ప్రత్యేక హోదా కోసం వదులుకుంది. అనంతరం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ప్యానల్ లోక్ సభ స్పీకర్ గా నియమించింది. 

ఆ నియామకాన్ని వైసీపీ స్వాగతించింది. ఇప్పటికే మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ గా స్పీకర్ స్థానంలో భాధ్యతలు సైతం నిర్వర్తించారు. తాజాగా ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని నియమించింది కేంద్రం. మాగుంటకు పదవి కట్టబెట్టడంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios