Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేటీకరణ దిశగా తిరుపతి, రాజమండ్రి, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు : పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర పౌర విమానాయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పార్లమెంట్‌కు తెలిపారు. 
 

Centers decision to lease 3 airports in ap
Author
First Published Dec 20, 2022, 3:40 PM IST

దేశవ్యాప్తంగా నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తూ వస్తోన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే దేశంలోని కీలక పోర్ట్‌లు , విమానాశ్రయాలను ప్రైవేట్‌పరం చేసింది. వచ్చే రెండేళ్ల కాలంలోనూ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగే అవకాశం వుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు కూడా ప్రైవేటీకరణ జాబితాలో వున్నాయట. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో కేరళ ఎంపీ ఎలమారం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానాయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. 

దీని ప్రకారం.. నేషనల్ మానిటైజేషన్ కింద 2022 - 25 మధ్యకాలంలో దేశంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు , సంస్థలకు లీజుకివ్వాలని నిర్ణయించింది కేంద్రం. ఇందులో ఏపీలోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు కూడా వున్నాయట. ఈ ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటీకరణల ద్వారా రూ.860 కోట్లు రాబట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2024 కల్లా తిరుపతి , ఆ తర్వాత విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల ప్రైవేటీకరణకు బిడ్డింగ్‌లను ఆహ్వానించనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios