చంద్రబాబునాయుడుకు కేంద్రం తాజాగా పెద్ద షాకిచ్చింది. విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ విషయమై ఇంతకాలం నానుస్తున్న కేంద్రం చివరకు సోమవారం స్పష్టత ఇచ్చింది. ఒకసారి చర్చలు జరుపుతున్నామని, ఒకసారి ఫీజుబులిటీ చూస్తున్నామంటూ సాకులు చెబుతున్న విషయం అందిరికీ తెలిసిందే. చివరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు ఓ లేఖ అందింది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధ్యం కాదని స్పష్టంగా చెప్పేసింది. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం రైల్వేజోన్ సాధ్యం కాదని చెప్పటంతో బిజెపి నేతలకు ఏమి మాట్లాడాలో ఇపుడు అర్దం కావటం లేదు.