సారాంశం

 మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మాట్లాడారు. కేంద్రం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

న్యూఢిల్లీ:మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఆదివారంనాడు  ఫోన్ లో మాట్లాడారు.  మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన సహాయ సహాకారాలను అందిస్తామని  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని అందించాలని  ప్రధాన మంత్రి అధికారులను ఆధేశించారు.మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.