జడ్జిలపై అభ్యంతర వ్యాఖ్యలు: మరో ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ


జడ్జిలు, కోర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసుపై సీబీఐ మరో చార్జీషీట్ ను దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్ కు తోడుగా మరో ఛార్జీషీట్ ను  దాఖలు చేశారు సీబీఐ అధికారులు. ఏపీలో కొందరు సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు నమోదయ్యాయి.

CBI files another charge sheet to CBI special court

తిరుపతి: జడ్జిలు, కోర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ అధికారులు మరో చార్జీషీట్ ను సోమవారం నాడు దాఖలు చేశారు.సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ దాఖలు  చేసింది సీబీఐ. ఈ చార్జీషీట్ లో నలుగురి పేర్లను  చేర్చింది సీబీఐ.కొండారెడ్డి, సుధీర్, ఆదర్శరెడ్డి, సాంబశివరెడ్డిపై అభియోగాలు మోపింది.  ఈ చార్జీషీట్ లో  మరో 16 మంది పేర్లను ఛార్జీషీట్‌లో పొందుపర్చారు.

also read:సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసు: సీబీఐ నివేదిక, విచారణకు 3 నెలల సమయం

2020 అక్టోబర్ 8వ తేదీన ఈ కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకొంది. సీబీఐ విచారణ జరిపి 2020 నవంబర్  16న  16 మందిపై కేసు నమోదు చేసింది. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసుల ఆధారంగానే సీబీఐ కేసులు నమోదు చేసింది.ఈ విషయమై గతంలో ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఇవాళ మరో ఛార్జీషీట్ ను సీబీఐ దాఖలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులతో పాటు ఆ తీర్పులను వెలువరించిన జడ్జిలపై కొందరు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఏపీ సీఐడీ దాఖలు విచారణ  సరిగా లేదని భావించిన  ఏపీ హైకోర్టు సీబీఐకి విచారణ బాధ్యతలను అప్పగించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios