Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకానందరెడ్డి కేసు: మర్డర్ స్థలంలో 3 గంటల పాటు సీబీఐ పరిశీలన

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పోమవారంనాడు సీబీఐ అధికారులు పులివెందులలోని వివేకా ఇంటిని మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన గది, బాత్రూంను క్షుణ్ణంగా శోధించారు.

CBI officials searches for evidence in YS Vivekananda Reddy house lns
Author
Kadapa, First Published Apr 12, 2021, 9:55 PM IST

కడప: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పోమవారంనాడు సీబీఐ అధికారులు పులివెందులలోని వివేకా ఇంటిని మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన గది, బాత్రూంను క్షుణ్ణంగా శోధించారు. వివేకా ఇంటిని సీబీఐ అధికారులు దాదాపు 3 గంటల పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా వివేకా పీఏ హిదయతుల్లాను ప్రశ్నించారు. వివేకా ముఖ్య అనుచరుడు యర్ర గంగిరెడ్డిని కూడా సీబీఐ బృందం నిశితంగా విచారించింది.

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు:సీబీఐ విచారణ మళ్లీ షురూ

 ఇటీవల వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దోషులెవరో తేల్చాలని కోరారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టిన కొన్నిరోజుల్లోనే సీబీఐ అధికారులు పులివెందుల రావడం ఆసక్తి కలిగిస్తోంది.రెండేళ్లైనా ఈ కేసులో నిందితులను తేల్చకపోవడంపై  వివేకానందరెడ్డి కూతురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు 2019 మార్చి 14వ తేదీన హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios