Asianet News TeluguAsianet News Telugu

జగన్ అక్రమాస్తుల కేసు : సీబీఐ నిజాలను తొక్కిపెడుతోంది..

జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన వాస్తవాలను కోర్టు దృష్టికి సీబీఐ తీసుకురావడం లేదని జగతి పబ్లికేషన్స్ సంస్థ తరఫు న్యాయవాదులు ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సలహా మేరకు జగతి సంస్థలో పెట్టబడులు పెట్టినట్లు ఈఆర్ఈఎస్ ప్రాజెక్ట్స్, మరో సంస్థ డైరెక్టర్లు చెప్పారని, దీనిమీద సీబీఐ ఆయన వివరణ తీసుకోలేదన్నారు. 

CBI not revealing facts in jagan Illegal assets case - bsb
Author
Hyderabad, First Published Jun 24, 2021, 2:11 PM IST

జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన వాస్తవాలను కోర్టు దృష్టికి సీబీఐ తీసుకురావడం లేదని జగతి పబ్లికేషన్స్ సంస్థ తరఫు న్యాయవాదులు ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సలహా మేరకు జగతి సంస్థలో పెట్టబడులు పెట్టినట్లు ఈఆర్ఈఎస్ ప్రాజెక్ట్స్, మరో సంస్థ డైరెక్టర్లు చెప్పారని, దీనిమీద సీబీఐ ఆయన వివరణ తీసుకోలేదన్నారు. 

రాంకీ సంస్థలో పెట్టుబడులకు సంబంధించిన కేసులో జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ బుధవారం సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. రాంకీ సంస్థకు అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలకు బదులుగా జగతి పబ్లికేషన్స్ లో రూ. 10 కోట్ల మేర పెట్టబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు.

ఈఆర్ఈఎస్, టీ డబ్ల్యూసీ ఇన్ ఫ్రా సంస్థల డైరెక్టర్ల నుంచి దర్యాప్తు సంస్థ వాంగ్మూలం తీసుకుందని.. వారిలో ఇద్దరు డైరెక్టర్లు ఆళ్ల సూచనల మేరకే పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారని, ఎమ్మెల్యే సీటుకోసం ప్రయత్నిస్తున్న ఆళ్ల ఆయా సంస్థల డైరెక్టర్లతో జగతిలో పెట్టబడులు పెట్టించారని, ఈ విషయాన్ని సీబీఐ తొక్కిపెట్టిందని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బి.ఆర్.మధుసూదన్ రావు గురువారానికి వాయిదా వేశారు. వాన్ పిక్ సంస్థ మీద నమోదు చేసిన కేసు విచారణ సైతం వాయిదా పడింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios