ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ కలెక్టరేట్ ముట్టడి
విశాఖ పట్టణంలో ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు కలెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు.
విశాఖపట్టణం: విశాఖ పట్టణంలో ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు కలెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నగరంలో సరస్వతి పార్క్ నుండి కలెక్టరేట్ వరకు భారీగా ప్రదర్శన నిర్వహించారు. నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిర్వాసితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిర్వాసితుల ఆందోళనతో కలెక్టరేట్ కు వెళ్లే రహదారులను మూసివేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లే చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడం ఇబ్బందిగా మారింది.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం సరైన నిర్ణయం కాదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశామన్నారు.ఈ ఆందోళనకు పలు పార్టీలు మద్దతును ప్రకటించాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.