Asianet News TeluguAsianet News Telugu

నకిలీ పత్రాలతో బ్యాంకు నుండి రుణం: శ్రీకృష్ణ ట్రేడర్స్ పై సీబీఐ కేసు


శ్రీకృష్ణ ట్రేడర్స్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన శ్రీ కృష్ణ ట్రేడర్స్ పై హైద్రాబాద్ లో సీబీఐ కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకు నుండి రూ. 338 కోట్ల రుణం తీసుకొని ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.

CBI files case against sri krishna traders  for bank fraud
Author
Kovvur, First Published Oct 3, 2021, 11:43 AM IST


హైదరాబాద్: శ్రీకృష్ణ ట్రేడర్స్ (sri krishna traders)పై సీబీఐ (cbi) కేసు నమోదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరుకు(kovvur) చెందిన శ్రీకృష్ణ ట్రేడర్స్ పై హైద్రాబాద్‌లో (hyderabad)సీబీఐ (cbi)ఆదివారం నాడు కేసు నమోదు చేసింది.

కెనరా బ్యాంక్ నుండి రూ. 338 కోట్ల రుణం  శ్రీకృష్ణ ట్రేడర్స్ తీసుకొంది. నకిలీ పత్రాలు(fake documents) పెట్టి రుణం (loan) తీసుకొంది శ్రీ కృష్ణ ట్రేడర్స్. అయితే తీసుకొన్న రుణం కూడా చెల్లించలేదు. అంతేకాదు శ్రీకృష్ణ ట్రేడర్స్  బ్యాంకులో సమర్పించిన డాక్యుమెంట్స్  నకిలీవని బ్యాంకు అధికారులు గుర్తించారు. 

దీనిపై కెనరా బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది.తోట కన్నారావు, తోట వెంకటరమణపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో  నకిలీ పత్రాలతో  బ్యాంకులను మోసం చేసిన కేసులు వెలుగు చూస్తున్నాయి. బ్యాంకులను మోసం చేసి రుణాలు పొంది తిరిగి రుణాలు చెల్లించని వారిపై బ్యాంకులు ఫిర్యాదులు చేస్తున్నాయి. రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకు అధికారులు రుణ గ్రహీతలు సమర్పించే డాక్యుమెంట్లు అసలువా, నకిలీవా అని ఎందుకు గుర్తించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios