Asianet News TeluguAsianet News Telugu

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు: పంచ్ ప్రభాకర్‌ కోసం ఇంటర్‌పోల్‌తో టచ్‌లో వున్నాం.. హైకోర్టుకు సీబీఐ వివరణ

న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టులో (ap high court) అఫిడవిట్ దాఖలు చేసింది సీబీఐ. న్యాయమూర్తులతో పాటు న్యాయవ్యవస్థను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు పంచ్ ప్రభాకర్ (punch prabhakar).

cbi files affidavit in ap high court over punch prabhakar case
Author
Amaravathi, First Published Nov 25, 2021, 3:46 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టులో (ap high court) అఫిడవిట్ దాఖలు చేసింది సీబీఐ. న్యాయమూర్తులతో పాటు న్యాయవ్యవస్థను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు పంచ్ ప్రభాకర్ (punch prabhakar). దీంతో ఆయన కోసం ఈ నెల 1న లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇంటర్‌పోల్ జారీ చేసిన బ్లూ నోటీసు ద్వారా అమెరికాలోని ఎఫ్‌బీఐ అతని చిరునామా సీబీఐకి ఇచ్చింది. దీంతో నవంబర్ 8న పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు, నాన్ బెయిలబుల్ వారెంట్ సంబంధిత కోర్టు నుంచి తీసుకుంది సీబీఐ. 

ఈ నెల 9న పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను కోరింది సీబీఐ. అతని అరెస్ట్‌కు సంబంధించి ఇంటర్‌పోల్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. కోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది. ఇక పంచ్ ప్రభాకర్ తాజా వీడియోలపై ఈ నెల 15న యూట్యూబ్ ఛానెల్‌తో వర్చువల్‌గా సమావేశమయ్యారు సీబీఐ అధికారులు. పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ ఛానెల్స్ మొత్తాన్ని తొలగించాలని యూట్యూబ్‌ను కోరింది సీబీఐ. అలాగే ఈ కేసుతో సంబంధం వున్న మిగిలిన వారిని విచారిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో 17వ నిందితుడిగా పంచ్ ప్రభాకర్‌ను చేర్చింది సీబీఐ. అంతేకాకుండా అఫిడవిట్‌ను పిటిషనర్లకు కూడా పంపింది. 

Also Read:జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు... పంచ్ ప్రభాకర్ పై బ్లూ నోటీసు జారీ..

కాగా.. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా Supreme Court and High Court Judgesకు దురుద్దేశాలు ఆపాదిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైకోర్టు అప్పటి రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదుపై గతేడాది ఏప్రిల్ 16 నుంచి జూలై 17 మధ్య సిఐడి లోని సైబర్ నేరాల విభాగం 12 కేసులు పెట్టింది. 16 మందిని నిందితులుగా పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది నవంబర్ 11న సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. స్వభావరీత్యా 12 కేసులూ  ఒకే తరహాలో ఉన్నందున.. వాటన్నిటిపై ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేసి 16 మందిని నిందితులుగా గుర్తించింది. 17వ నిందితుడి స్థానంలో వివరాలు తెలియని వ్యక్తి గా పేర్కొంది.

మొత్తంగా 11 చార్జిషీట్లు దాఖలు 

ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిపై సిబిఐ గుంటూరులోని సివిల్ జడ్జి న్యాయస్థానం.. (CBI Designated Court)లో  వేర్వేరుగా అభియోగ పత్రాలు దాఖలు చేసింది.  Indecent abuse వ్యవహారంలో  అవుతు శ్రీధర్ రెడ్డి (ఏ7),  జలగం వెంకట సత్యనారాయణ (ఏ8),  గూడ శ్రీధర్ రెడ్డి (ఏ9),  శ్రీనాథ్ సుస్వరం (ఏ12),   దరిశ కిషోర్ రెడ్డి (ఏ13)తో పాటు ముదునూరి అజయ్ అమృతల ప్రమేయాన్ని చార్జిషీట్లో ప్రస్తావించింది.

వీరంతా అక్టోబర్ 22న అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.  ఇదే కేసులో ఇప్పటికే  ధనిరెడ్డి కొండా రెడ్డి (ఏ1),  పాములు సుదీర్ (ఏ3), ఆదర్శ పట్టపు అలియాస్ ఆదర్శ రెడ్డి (ఏ4),  లావనూరు సాంబశివారెడ్డి అలియాస్ శివారెడ్డి (ఏ6), లింగా రెడ్డి రాజశేఖర్ రెడ్డి (ఏ15) లను అరెస్టు చేసి..  వారి పాత్రపై వేరువేరుగా Chargesheets దాఖలు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios