జగన్ ఆస్తుల కేసులో మినహాయింపు అంశంపై తుది తీర్పును వెల్లడించనున్న నేపథ్యంలో సీబీఐ మినహాయింపు ఇస్తుందా లేక హైకోర్టు లాగా కొట్టివేస్తుందా అన్నది సస్పెన్షన్ నెలకొంది. 

హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉండటంతో సీబీఐ కోర్టు ఏం చెప్పబోతుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది వైసీపీ. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జగన్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఈనెల 18న ఆస్తుల కేసులకు సంబంధించి అటు జగన్ తరపు న్యాయవాది, సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 

ఈనెల 18న వాదనలు ముగియడంతో తుది తీర్పును నవంబర్ 1కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణయం వెల్లడించనుందా అని తెలురాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ పాలనలో బిజీబిజీగా ఉండటంతో ప్రతీ శుక్రవారం తాను కోర్టుకు హాజరయ్యే అంశంపై మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

ప్రతీ శుక్రవారం విచారణకు తన బదులు తన తరపు న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్​లోని కోర్టుకు హాజరు కావడానికి సుమారు రెండు రోజులు పడుతోందన్నారు. అందుకు ఖర్చు కూడా అధికంగా అవుతుందని జగన్ అప్పీల్ లో తెలిపారు. 

రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తాను ఎక్కువ సమయం ఏపీలోనే కేటాయించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కీలకమైన పథకాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో మినహాయింపు కోరుతున్నట్లు జగన్ తెలిపారు. 

అయితే ఈనెల 18న సీబీఐ కోర్టులో జరిగిన వాదనల్లో జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేసు విచారణకు తీవ్ర జాప్యం జరుగుతోందని ఇలాంటి జగన్​కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందని వాదించింది. 

జగన్ రాజకీయ, ధన, అర్ధ, అంగ బలంతో సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం పొంచి ఉందన్నారు.చట్టం ముందు అందరూ సమానులేనని ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ బలంగా వాదనలు వినిపించింది. 

గతంలో ఇదే అభ్యర్థనపై జగన్ దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసినందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. ముఖ్యమంత్రిగా జగన్ హోదా పెరగొచ్చుగానీ కేసులో ఎలాంటి మార్పులు ఉండవని ఆరోపించారు. 

ఇకపోతే సీఎం జగన్ తాను పాదయాత్ర సమయంలో హైకోర్టులో అప్పీల్ చేసిన విషయం వాస్తవమేనని జగన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే అది రాజకీయ పరమైన అంశం కావడంతో అందుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. 

తనపై విచారణ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు తాను సాక్షులను ప్రభావితం చేయలేదని, తనపై ఏమైనా ఆరోపణలు వచ్చాయా అని జగన్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టే మినహాయింపు కోరుతున్నట్లు తెలిపారు. 

ఇరువైపు వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును నవంబర్ 1కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నేడు జగన్ ఆస్తుల కేసులో మినహాయింపు అంశంపై తుది తీర్పును వెల్లడించనున్న నేపథ్యంలో సీబీఐ మినహాయింపు ఇస్తుందా లేక హైకోర్టు లాగా కొట్టివేస్తుందా అన్నది సస్పెన్షన్ నెలకొంది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆరేళ్లలో ఏనాడైనా ఆరోపణలు వచ్చాయా....?: సీబీఐ కోర్టులో సీఎం జగన్

సీబీఐ కేసులున్న జగన్ కేంద్రంతో..... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఆస్తుల కేసు: వైఎస్ జగన్ కోర్టు హాజరుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?