ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.  దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. గురువారం సీబీఐ, ఈడీ కోర్టు జగన్ కేసుపై విచారణ జరిపింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ వారెంట్‌ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు ఇదే కేసులో సీఎం వైఎస్ జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి. పెన్నా కేసులో విశ్రాంత ఐఏఎస్‌ జి.వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఎన్‌బీడబ్ల్యూను న్యాయస్థానం రీకాల్‌ చేసింది. వాన్‌పిక్‌ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి ఈరోజు విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరికీ గతంలో హైకోర్టు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు కానీ, వారి తరఫు న్యాయవాదులు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు గైర్హాజరైతే తగిన ఉత్తర్వులిస్తామని కోర్టు స్పష్టం చేసింది.