Asianet News TeluguAsianet News Telugu

jagan davos tour : జగన్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్.. అనుమతించిన కోర్ట్

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ వాణిజ్య సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ న్యాయస్థానం నుంచి అనుమతి కోరారు. 
 

cbi court allows ap cm ys jagan to attend davos conference
Author
Hyderabad, First Published May 13, 2022, 9:51 PM IST

ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని (switzerland) దావోస్‌లో (davos) జరగనున్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు (world economic forum) వెళ్లేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (ys jagan) సీబీఐ కోర్ట్ (cbi court) అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్  షరతును సడలించాలని సీఎం తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో అధికార పర్యటనకు వెళ్తున్నట్లు తెలిపారు. దీనిపై సీబీఐ వాదనలు వినిపిస్తూ.. దావోస్ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి మంజూరు చేయవద్దని కోరింది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్తే కేసు విచారణలో జాప్యం జరుగుతుందని వాదించింది. ఇరు వైపులా వాదనలను పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. 

ఇకపోతే.. దావోస్‌లో జరగనున్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లోని అవకాశాలు.. ఇక్కడి ప్రజల పురోగతి’ అన్న అంశంపై సీఎం జగన్ బృందం పాల్గొననుంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (gudivada amarnath) దావోస్ సదస్సుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోగో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. దాదాపు 30 అంతర్జాతీయ కంపెనీలతో తాము సమావేశం కాబోతున్నామని.. సీఎం జగన్  స్వయంగా వస్తున్నందున పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిచ్చే విషయమై సత్వరమే నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios