ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి లండన్‌ పర్యటనకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై విచారణ జరిపిన నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానం ఈ నెల 18 నుంచి మార్చి 18 మధ్య వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.