టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ సమన్లు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

2017లో బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసినట్లు బెంగళూరులో సుజనాపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిందిగా సుజనాకు సమన్లు జారీ చేశారు.