వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: కారు డ్రైవర్ దస్తగిరిని విచారించిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ అధికారులు సోమవారం నాడు ప్రారంభించారు. కడపలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు ఈ కేసు విచారణ నిర్వహిస్తున్నారు.
కడప:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ అధికారులు సోమవారం నాడు ప్రారంభించారు. కడపలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు ఈ కేసు విచారణ నిర్వహిస్తున్నారు.దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు. 2019 మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు.
also read:జగన్ ఫ్యామిలీ, బంధువుల అరెస్ట్‌కై ఒత్తిడి: వివేకా హత్యపై ఏబీవీకి ఏపీ పోలీస్ కౌంటర్
వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు దాటినా కూడ ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడంపై ఆయన కూతురు సునీతా రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సీబీఐ అధికారులకు ఈ విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 2న వినతి పత్రం సమర్పించారు. ఆ తర్వాత అదే నెల ఏప్రిల్ 12న సీబీఐ అధికారులు విచారణను ప్రారంభించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. ఆ తర్వాత మళ్లీ ఇవాళ సీబీఐ అధికారులు మరోసారి విచారణను ప్రారంభించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఏప్రిల్ 18న లేఖ రాయడం చర్చకు దారితీసింది.వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు వరుసగా మరణించడంపై కూడ వివేకానందరెడ్డి కూతురు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గతంలో సీబీఐ నోటీసులు అందుకొన్న వారిని అధికారులు విచారించే అవకాశం ఉంది.