జగన్ ఫ్యామిలీ, బంధువుల అరెస్ట్‌కై ఒత్తిడి: వివేకా హత్యపై ఏబీవీకి ఏపీ పోలీస్ కౌంటర్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు దర్యాప్తుపై మాజీ ఏపీ ప్రభుత్వ ఇంటలిజెన్స్ చీఫ్  ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలను డీఐజీ పాల్ రాజు తీవ్రంగా ఖండించారు. జగన్ కుటుంబసభ్యులను, బంధువులను అరెస్ట్ చేయాలని  ఆ సమయంలో ఏబీవీ ఒత్తిడి తెచ్చారని  ఆయన ఆరోపించారు. 

AP police reacts on AB venkateswara rao letter over YS Vivekananda Reddy murder case

కడప:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు దర్యాప్తుపై మాజీ ఏపీ ప్రభుత్వ ఇంటలిజెన్స్ చీఫ్  ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలను డీఐజీ పాల్ రాజు తీవ్రంగా ఖండించారు. జగన్ కుటుంబసభ్యులను, బంధువులను అరెస్ట్ చేయాలని  ఆ సమయంలో ఏబీవీ ఒత్తిడి తెచ్చారని  ఆయన ఆరోపించారు. 

ఆదివారం నాడు విజయవాడలో  సిట్  దర్యాప్తును పర్యవేక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం వైఎస వివేకానందరెడ్డి  హత్య కేసు దర్యాప్తుపై మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారని వారు ప్రశ్నించారు. తన వద్ద కీలక సమాచారం ఉంటే ఇంతకాలం ఎందుకు  ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణలను వాస్తవం కాదన్నారు. 

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐకి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

ఏబీ వెంకటేశ్వరరావు వద్ద  ఉన్న సమాచారం సీల్డ్ కవర్లో  ఇవ్వవచ్చని ఆయన కోరారు. పిట్ దర్యాప్తుపై  ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు సరికాదన్నారు.హత్య కేసులో నిజాలు వెలికితీయకుండా సీఎం కుటుంబంపై బురదజల్లారని వారు ఆరోపించారు.ఈ హత్య కేసు దర్యాప్తును 15 రోజుల పాటు ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యక్షంగా పర్యవేక్షించారని  వారు గుర్తు చేశారు.ఈ సమాచారాన్ని సీబీఐకి ఇవ్వకుండా ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

సమాచారం వేరు, ఆధారాలు వేరు, దర్యాప్తు వేరని వారు తెలిపారు.  వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత 15 రోజుల పాటు  ప్రతి రోజూ  అప్పటి సీఎంకి, డీజీపీకి ఇచ్చేవారని పోలీసులు గుర్తు చేశారు.  ఇంటలిజెన్స్ వింగ్ నుండి బదిలీ అయ్యే సమయం వరకు  ఈ కేసును  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసును  ఏబీ వెంకటేశ్వరరావు  ప్రతి రోజూ  సమీక్షించేవారని  పోలీసు ఉన్నతాధికారులు గుర్తు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios