కృష్ణా జిల్లాలో సీబీసీఐడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కంచికచర్ల, మొగులూరు, బట్టినపూడి, మున్నలూరులలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొగులూరు సొసైటీలో రైతులతో విడివిడిగా మాట్లాడి ఓ రాజ్యసభ సభ్యుడి ప్రమేయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతుల భూములు, చెక్కులపై సీఐడీ అధికారులు ఆరా తీశారు. మొగులూరులో రియల్ ఎస్టేట్ వ్యవహారంపై రెండు రోజుల పాటు సోదాలు జరుపుతారని సమాచారం.