Asianet News TeluguAsianet News Telugu

టీటీడీపై నిరాధార ఆరోపణలు.. ఇద్దరిమీద కేసులు..

తిరుపతి లో నివాసముంటున్న పి.నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీపై ఓ నిరాధారమైన  నకిలీ వార్తను సోషల్ మీడియాలో, తన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

Cases against two who made baseless allegations against TTD - bsb
Author
Hyderabad, First Published Jul 20, 2021, 2:01 PM IST

తిరుమల : టీటీడీపై నిరాధార ఆరోపణలతో ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ టిటిడి విజిలెన్స్ వింగ్ అధికారి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. 

టూ టౌన్ ఎస్ఐ వెంకటముని తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి లో నివాసముంటున్న పి.నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీపై ఓ నిరాధారమైన  నకిలీ వార్తను సోషల్ మీడియాలో, తన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

తద్వారా టిటిడి ప్రతిష్టను, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీశాడు.  దీనిపై టీటీడీ విజిలెన్స్ వింగ్ ఏవీఎస్వో ఎస్.పద్మనాభన్ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుపై న్యాయస్థానం అనుమతి తీసుకుని నవీన్ కుమార్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

టీటీడీ ఇటీవల లడ్డూ కౌంటర్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు కేటాయించడంపై జెమిని న్యూస్ ఆన్లైన్ డాట్ కామ్ ఎడిటర్.. టీటీడీ అధికారులు ముడుపులు తీసుకుంటున్నట్టు నిరాధార ఆరోపణలు చేశారని టీటీడీ విజిలెన్స్ వింగ్‌ ఏవీఎస్వో పద్మనాభన్‌ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

టిటిడి అధికారులు ఉద్యోగుల మనోభావాలను దెబ్బ తీశారని పేర్కొన్నారు.  ఈ ఫిర్యాదుపై న్యాయస్థానంపై కేసు నమోదు చేసినట్లు తిరుమల టూటౌన్‌ ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios