చంద్రబాబు, లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ లపై ఉన్న అవినీతి ఆరోపణల కేసును ఉపసంహరించుకున్నారు. చంద్రబాబు, లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.

కాగా..ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. దీంతో శ్రవణ్‌కుమార్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.