Asianet News TeluguAsianet News Telugu

సత్తెనపల్లిలో కే ట్యాక్స్ వసూళ్లు: మాజీ స్పీకర్ కోడెల తనయుడుపై కేసు నమోదు

తమ పనుల కోసం లక్షలాది రూపాయలు లక్షల రూపాయలను ముట్టచెప్పినా ఇంకా కావాలని వేధిస్తుండటంతో ఓపిక నశించిన పోలీసులను ఆశ్రయించినట్లు రామిరెడ్డిపేటకు చెందిన కె.మల్లికార్జున రావు అనే వ్యక్తి నరసరావు పేట పోలీసులను ఆశ్రయించారు. 

case filed against kodela sivaram over k tax issue
Author
Guntur, First Published Jun 8, 2019, 3:21 PM IST

గుంటూరు: అధికారంలో ఉన్నప్పుడు ‘కే’ ట్యాక్స్‌ పేరుతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ వేధింపులకు గురి చేశారంటూ కొందరు బాధితులు నరరావుపేట పోలీసులను ఆశ్రయించారు. 

నియోజకవర్గంలో ఏ పనులు చేపట్టాల్సి వచ్చినా కే ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడేవారని బాధితులు ఆరోపించారు. కోడెల తనయుడు కోడెల శివరామ్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా చెల్లిందని ఆరోపించారు. 

తమ పనుల కోసం లక్షలాది రూపాయలు లక్షల రూపాయలను ముట్టచెప్పినా ఇంకా కావాలని వేధిస్తుండటంతో ఓపిక నశించిన పోలీసులను ఆశ్రయించినట్లు రామిరెడ్డిపేటకు చెందిన కె.మల్లికార్జున రావు అనే వ్యక్తి నరసరావు పేట పోలీసులను ఆశ్రయించారు. 

వివరాల్లోకి వెళ్తే రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో  రామిరెడ్డి పేటకు చెందిన కె.మల్లికార్జునరావు ఓ అపార్ట్‌మెంట్‌ అనుమతి కోసం ప్రయత్నించాడు. అపార్ట్మెంట్ అనుమతుల కోసం ఇంజనీర్  ఉన్నం వేణుగోపాల్ రావును రెండేళ్ల క్రితం సంప్రదించాడు. 

అనమతులు కావాల్సిన పత్రాలతోపాటు చెల్లించాల్సిన ఫీజులు, మామూళ్లు అందించాడు. అనుమతులు ఇప్పించకుండా వేణుగోపాలరావు కాలయాపన చేస్తుండటంతో పనులు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. 

అనంతరం వేణుగోపాలరావ్ ను నిలదీస్తే కోడెల శివరాంకు కప్పం చెల్లిస్తేనే అపార్టమెంట్ నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఇంజనీర్ మాటలను ఖాతరు చేయకుండా మల్లిఖార్జునరావు నిర్మాణ పనులు చేపట్టడంతో పంచాయితీ సెక్రటరీ భార్గవ్, ఈవోపీఆర్ డీ శివసుబ్రహ్మన్యం వచ్చి పనులు నిలిపివేశారు.

కే ట్యాక్స్ చెల్లించకపోతే నిర్మాణాలు కూల్చివేస్తామని హెచ్చరించారు. పనులు మధ్యలో నిలిచిపోవడంతో చేసేది లేక మల్లిఖార్జునరావు ఇంజనీర్ వేణుతో కలిసి గుంటూరులోని కోడెల శివరామ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ శివరామ్, అతని పీఏ గుత్తా నాగ శివప్రసాద్ ఒక్కో ప్లాట్ కు రూ.50వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

మెుత్తం రూ.17 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సొమ్మును ఇంజనీర్ వేణుకు అందించాలని ఆదేశించారు. దీంతో మల్లిఖార్జునరావు ఇంజనీర్ కు రూ.14 లక్షలు అందజేశారు. అయితే మిగిలిన మూడు లక్షల రూపాయల కోసం ఇంజనీర్ వేణు వేధింపులకు పాల్పడుతుండటంతో ఈ వ్యవహారాన్ని ఫోన్ లో రికార్డు చేసిన బాధితుడు నరసరావుపేట్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తనకు న్యాయం చేయాలని వాపోయారు. బాధితుడు ఫిర్యాదుతో కోడెల శివరామ్, అతని అనుచరుడు గుత్తా నాగ ప్రసాద్, ఇంజనీర్ వేణుగోపాలరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అపార్ట్‌మెంట్‌ అనుమతుల వ్యవహారంలో బెదిరించి నగదు వసూళ్లు చేసిన కోడెల శివరామ్, అతని పీఏ గుత్తా ప్రసాద్, ఇంజినీర్‌ వేణులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఏవీ బ్రహ్మం మీడియాకు తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios