ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ‌పై కేసు నమోదు

Case filed against Ap Congress party leader Sunkara padmasri
Highlights

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై  గురువారం నాడు కేసు నమోదైంది.  తన కుమారుడు చెరువులో పడి మృతి చెందిన ఘటనపై  వచ్చిన పరిహారాన్ని  కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ  ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతోందని  మరియంబీ అనే మహిళా ఆత్కూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై  గురువారం నాడు కేసు నమోదైంది.  తన కుమారుడు చెరువులో పడి మృతి చెందిన ఘటనపై  వచ్చిన పరిహారాన్ని  కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ  ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతోందని  మరియంబీ అనే మహిళా ఆత్కూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బుధవారం నాడు గ్రామదర్శిని కార్యక్రమంలో  భాగంగా  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దృష్టికి ఈ విషయాన్ని  మరీయంబీ తీసుకొచ్చింది. దీంతో  పోలీసులకు ఫిర్యాదు చేయాలని  బాధితురాలికి వంశీ సూచించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

రెండేళ్ల కిందట తన కుమారుడు ఓ డైరీలో ఫాంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ పక్కనున్న చెరువులో పడి చనిపోయాడని బాధితురాలు  చెబుతోంది.  అయితే డైరీ ఫాం యజమాని  ఇచ్చిన డబ్బులను  తనకు ఇవ్వకుండా సుంకర పద్మశ్రీ  కాజేశారని బాధితురాలు ఆరోపించారు.  ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే  ఈ కేసు విషయమై  సుంకర పద్మశ్రీ స్పందించారు.  గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీమోహన్ చేస్తున్న అరాచకాలను బయటపెట్టడంతోనే  తనపై అక్రమంగా కేసులు బనాయించారని  ఆమె ఆరోపించారు.  బ్రహ్మలింగయ్య చెరువులో నీరు- చెట్టు కార్యక్రమంలో  కోట్లాది రూపాయాలను  వంశీ దోచుకొన్నారని  ఆమె ఆరోపించారు.  ఈ విషయాన్ని బయటపెట్టినందుకే తనపై కక్షకట్టారని  తెలిపారు.

ఈ వార్త చదవండి. వల్లభనేని వంశీపై సుంకర పద్మశ్రీ సంచలనం  సుంకర పద్మశ్రీపై పరువునష్టం దావా వేస్తా: వంశీ

 

 

loader