నారాయణ, పత్తిపాటిలపై కేసు: బాబు మాజీ పీఎస్ ఇంట్లో రెండో రోజూ సోదాలు

మాజీ మంత్రులు, టీడీపీ నేతలు నారాయణ, పత్తిపాటి పుల్లారావుపై సీఐడి కేసులు నమోదు చేసింది. కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ ఇంట్లో రెండో రోజు ఐటి సోదాలు జరుగుతున్నాయి.

Case booked against Narayana and Pattipati Pulla rao

అమరావతి: అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ దూకుడు ప్రదర్శిస్తోంది. మరో ఏడుగురిపై కేసులను సీఐడీ నమోదు చేసింది. వారిలో తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు ఉన్నారు. వారిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. 

అమరావతి ప్రాంతంలోని వెంకటపాలేనికి చెందిన ఓ దళిత మహిళ భూమిని అక్రమంగా కాజేశారనే అందిన ఫిర్యాదుతో వారిద్దరిపై కేసులు నమోదయ్యాయి. వారిద్దరు అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెల్లకార్డు హోల్డర్లను బినామీలుగా పెట్టుకుని 761.34 ఎకరాలను కొనుగోలు చేయడంపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై కేసులు నమోదయ్యాయి.

రాజధాని పేరుతో అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్ వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయడంతో టీడీపీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసింది. 

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యద్రశి పెండ్యాల శ్రీనివాస రావు నివాసంలో రెండో రోజు శుక్రవారం ఐటి సోదాలు జరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్ అదనపు సిబ్బంది శ్రీనివాస రావు నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సోదాలు మరో రెండు రోజులు సాగుతాయని అంటున్నారు. 9 మంది అధికారులు గురువారం నుంచి సోదాలు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios