విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. కేంద్రీయ విద్యాలయం స్కూల్ వద్ద పిల్లలపైకి దూసుకెళ్లింది.
విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. కేంద్రీయ విద్యాలయం స్కూల్ వద్ద పిల్లలపైకి దూసుకెళ్లింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి స్కూల్ ఎదురుగా వాహనాలతో పాటు విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో గాయపడిన స్కూల్ విద్యార్థులను స్కూల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక, ప్రమాదం జరిగిన స్థలంలో పాఠశాలకు వెళుతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగంగా కారును నడపడం, ఆపై దానిని కారును నియంత్రించలేకే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తోంది.
