Asianet News TeluguAsianet News Telugu

ఆర్ధిక వ్యవహారాల్లో రాజ్యాంగ ఉల్లంఘన.. అసెంబ్లీలో కాగ్ నివేదిక, జగన్ ప్రభుత్వానికి అక్షింతలు

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి చెందిన రాష్ట్ర‌ ఆర్థిక ప‌రిస్థితిపై (ap financial status) శుక్రవారం ఏపీలో అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను (cag report) ప్ర‌క‌టించారు. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్య‌వ‌హ‌రించింద‌ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది

cag report on andhra pradesh
Author
Amaravati, First Published Nov 26, 2021, 4:07 PM IST

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి చెందిన రాష్ట్ర‌ ఆర్థిక ప‌రిస్థితిపై (ap financial status) శుక్రవారం ఏపీలో అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను (cag report) ప్ర‌క‌టించారు. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్య‌వ‌హ‌రించింద‌ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన అనుబంధ ప‌ద్దుల‌ను ఖ‌ర్చు చేసి.. త‌ర్వాత జూన్ 2020లో శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు.. ఇది రాజ్యాంగ విరుద్దని నివేదిక పేర్కొంది. రాజ్యాంగ నిబంధ నలకు వ్య‌తిరేకంగా ఆర్థిక వ్య‌వ‌హారాలు జ‌రిగాయని కడిగిపారేసింది. 

చ‌ట్టస‌భ‌ల ఆమోద ప్ర‌క్రియ‌ను, బ‌డ్జెట్ మీద అదుపును బ‌ల‌హీన‌ ప‌రిచారని మండిపడింది. ప్ర‌జా వ‌న‌రుల వినియోగ నిర్వ‌హ‌ణ‌లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యాన్ని ప్రోత్స‌హించారని కాగ్ చెప్పింది. శాస‌న స‌భ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖ‌ర్చు చేసే సంద‌ర్భాలు పున‌రావృతం అవుతున్నాయని మండిపడింది.

Also Read:విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ఏపీ అసెంబ్లీలో వరదలపై జగన్

ఇక అద‌న‌పు నిధులు అవసరం అని భావిస్తే…శాస‌న స‌భ నుంచి ముంద‌స్తు ఆమోదం పొందేలా చూసుకోవాలని  హితవు పలికింది. గత ఐదేళ్ల నుంచి చెబుతోన్నా మార్పు రావడం లేదని... 2018 -19 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోల్చితే 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబ‌డులు తగ్గాయని తెలిపింది. కొత్త సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల 6.93 శాతం మేర రెవెన్యూ ఖ‌ర్చులు పెరిగాయని వెల్లడించింది. 2018-19 నాటితో పొల్చితే 2019-20 నాటికి రూ. 32,373 కోట్ల మేర పెరిగిన బ‌కాయిల చెల్లింపులు పూర్తి చేశారని కాగ్ నివేదిక పేర్కొంది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వివ‌రాల‌ను బ‌డ్జెట్ ప‌త్రాల్లో స‌రిగా చూప‌లేదని...శాన‌స వ్య‌వ‌స్థను నీరు గార్చేలా… నిధుల నిర్వ‌హ‌ణ ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios