Asianet News TeluguAsianet News Telugu

బాబుకు షాక్: మందకొడిగా పనులు.... కాంట్రాక్టర్లపై చర్యలేవి: కాగ్

పోలవరం ప్రాజెక్టుపై కాగ్ కీలకమైన నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో  మందకొడిగా పనులు జరుగుతున్నా...కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంపై  కాగ్ తన నివేదికలో తప్పుపట్టింది.

cag key report on polavaram project
Author
Amaravathi, First Published Sep 19, 2018, 3:18 PM IST

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై కాగ్ కీలకమైన నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో  మందకొడిగా పనులు జరుగుతున్నా...కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంపై  కాగ్ తన నివేదికలో తప్పుపట్టింది.

కేంద్ర జలవనరుల సంఘం డీపీఆర్‌ను ఆమోదించకముందే  హెడ్‌వర్క్స్పనులు అప్పగించారని తెలిపింది. ఒప్పందాలు రద్దయి.. ఖర్చు పెరగడంతో.. జాప్యం పెరిగిందని కాగ్ అభిప్రాయపడింది.

 2005లో డీపీఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ విలువ రూ.10,151 కోట్లు కాగా, 2010లో డీపీఆర్ ప్రకారం రూ.16,010 కోట్లు, తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టు రేటు రూ.55,132 కోట్లకు చేరిందని కాగ్ నివేదికలో పేర్కొంది.
 
గత 12 ఏళ్లలో 4,069 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని.. 192 గ్రామాల విషయంలో పునర్నిర్మాణ ప్రణాళికను ఖరారు చేయలేదని కాగ్ తన నివేదికలో వివరించింది.  ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో ముంపు నివారించేందుకు నిర్మించాల్సిన రక్షణ కట్టల నిర్మాణంలో పురోగతి లేదని చెప్పింది.

భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణాలపై పెట్టిన ఖర్చు వివరాలు వెల్లడించకపోవడంతో రూ.1,408 కోట్లు అందలేదని నివేదికలో పేర్కొంది. దీంతో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడానికి హెడ్‌వర్క్స్ కాంట్రాక్టర్‌కు రూ.1,854 కోట్ల రాయితీలకు అనుమతించిన పనుల్లో పురోగతి లేదంది.

పునరావాస పునర్నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వేసిన కమిటీలు నిర్దేశించినట్లు సమావేశం కాలేదని చెప్పింది.అటవీ పర్యావరణ అనుమతులకు సంబంధించిన నిబంధనలు అమలు జరగడం లేదని  కాగ్ అభిప్రాయపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios