13 జిల్లాలకే పరిమితమైన పార్టీలు ఏం చేయలేవు.. కాంగ్రెస్‌తోనే ప్రత్యేకహోదా: బైరెడ్డి

First Published 21, Jul 2018, 11:24 AM IST
byreddy rajashekar reddy comments in AP regional parties
Highlights

13 జిల్లాలకే పరిమితమైన పార్టీలు ఏమీ చేయలేవని.. ఏం సాధించలేవని అన్నారు... బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్‌తోనే ప్రత్యేకహోదా సాధ్యమని... అతి త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు బైరెడ్డి

13 జిల్లాలకే పరిమితమైన పార్టీలు ఏమీ చేయలేవని.. ఏం సాధించలేవని అన్నారు... బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్‌తోనే ప్రత్యేకహోదా సాధ్యమని... అతి త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు బైరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పొలిటికల్ స్టాండ్ గురించి క్లారిటీ ఇచ్చారు.

గతంలో టీడీపీ తరపున పనిచేసిన బైరెడ్డి ఎన్నికల బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. రాయలసీమ సాధన సమితిని స్ధాపించారు. ఉద్యమంలో భాగంగా బైరెడ్డి సీమ జిల్లాల్లో యాత్రలు, సమావేశాలు, సభలు నిర్వహించినా ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు.

అనంతరం ఆయన టీడీపీలో తిరిగి చేరుతారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు.. తాజాగా కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్ చాందీతో భేటీ అయి.. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 
 

loader