అందుకే వైసీపీని వీడి.. టీడీపీలో చేరా.. బుట్టా రేణుక

First Published 11, Jul 2018, 9:50 AM IST
butta renuka  says why she changed the party ycp to tdp
Highlights

 వచ్చే ఎన్నికల్లో తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నందునే వైకాపాకు దూరమైనట్లు రేణుక చెప్పారు. స్థానిక నేతలతో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని వివరించారు.

కేంద్రప్రభుత్వం.. హోదా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్‌ విషయంలో రాష్ట్ర ప్రజలను భాజపా అవమానిస్తోందని వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి కర్నూలు ఎంపీగా ఆమె గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా.. తర్వాత ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తాజాగా.. తాను పార్టీ మారడానికి గల కారణాలను ఆమె వివరించారు.

 వచ్చే ఎన్నికల్లో తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నందునే వైకాపాకు దూరమైనట్లు రేణుక చెప్పారు. స్థానిక నేతలతో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని వివరించారు.

వచ్చే ఎన్నికల్లో సైతం తాను ఎంపీగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తనకు ఎంపీ గానే ప్రజలకు సేవ చేయడం ఇష్టమని పేర్కొన్నారు. గతంలో తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయనున్నట్లు ప్రచారం జరిగిందని.. అవన్నీ వాస్తవాలను పేర్కొన్నారు. తనకు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. 

loader