తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో ఫైనాన్స్ వ్యాపారి నల్లమల్లి రాజారెడ్డిని అతని వ్యాపార భాగస్వామి కర్రిమారెడ్డి కర్రతో కొట్టి చంపాడు.  వ్యాపారంలో ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఫైనాన్స్ వ్యాపారి నల్లమిల్లి రాజారెడ్డి హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. కొంత కాలంగా వీరిద్దరూ భాగస్వామ్యంతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారంలో చోటు చేసుకొన్న ఆర్ధిక లావాదేవీల కారణంగానే ఈ హత్య చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.