కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర నుంచి మల్లన్న దర్శనం కోసం 50 మంది ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు శ్రీశైలం బయలుదేరింది. ఆదివారం ఉదయం నల్లమల ఘాట్ రోడ్‌లో చిన్నారుట్ల వద్ద బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.

అయితే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు ఘాట్ రోడ్డు ప్రహరీగోడను ఢీకొని ఏటవాలుగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్నపోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని  ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు.