Asianet News TeluguAsianet News Telugu

చిన్నారులకు సీఎం జగన్‌ మేనమామగా మారారు.. బుగ్గన

అమరావతి: నాణ్యమైన చదువును చెప్పించడంతో పాటు, వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలోని చిన్నారులందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనమామగా మారిపోయారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. 

Buggana rajendraprasad praised cm ys jagan over child welfare schemes - bsb
Author
Hyderabad, First Published May 20, 2021, 4:30 PM IST

అమరావతి: నాణ్యమైన చదువును చెప్పించడంతో పాటు, వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలోని చిన్నారులందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనమామగా మారిపోయారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. 

గురువారం ఆయన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో మాట్లాడుతూ, అన్నం పెట్టి ఎదుటి వారి ఆకలి తీర్చే ప్రతి ఒక్కరూ లోకంలో వందనాలు అందుకో తగినవారేనని, సీఎం వైఎస్‌ జగన్‌ ఆ కోవకే చెందినవారని.. అందుకు జగనన్న గోరుముద్ద పథకమే సాక్ష్యమని తెలిపారు. 

చదువుతో పాటు సరైన పోషకాహారం అవసరాన్ని గుర్తించిన సీఎం జగన్‌.. పిల్లలకు రుచికరమైన, బలవర్ధకరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారని మంత్రి రాజేంద్రనాథ్‌ అన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఒక్క రోజుకే అసెంబ్లీ సమావేశాలను పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే ఈ సమావేశాలకు హాజరైన జగన్ మాస్క్ ధరించకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 

దీనిమీద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. ముఖ్య‌మంత్రి గారూ! మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి... అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయ‌ల యాడ్స్‌ ఇచ్చిన మీరు మాస్క్ ధ‌రించ‌కుండా ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలిస్తున్నారంటూ సెటైర్లు వేశారు.

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే.. ముఖ్య‌మంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోక‌పోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధ‌రిస్తారు? అని ప్రశ్నించారు. 

తొలి విడ‌త‌లో కోవిడ్ వైర‌స్ చిన్న‌పాటి జ్వ‌రం లాంటిదేన‌ని, పారాసెట‌మాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చ‌ల్లితే చ‌స్తుంది..ఇట్ క‌మ్స్ ఇట్ గోస్..ఇట్ షుడ్‌బీ నిరంత‌ర ప్ర‌క్రియ‌, స‌హ‌జీవ‌నం అంటూ ఫేక్ మాట‌ల‌తో వేలాది మందిని బ‌లిచ్చారని మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios