శాసనమండలికి మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు: ప్రవేశ పెట్టిన ఏపీ మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశ పెట్టింది. ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. 

Buggana Rajendranath reddy introduces withdraw creation of of 3 capitals in Ap legislative council

అమరావతి: మూడు రాజధానుల చట్టం ఉప సంహరణ బిల్లును ఏపీ శాసనమండలిలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం నాడు ప్రవేశ పెట్టారు.నిన్ననే ఈ బిల్లును ap assembly లో ప్రవేశ పెట్టింది  ప్రభుత్వం. ఈ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఇవాళ ఈ బిల్లును Ap legislative council లో ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  Buggana Rajendranath reddy  ప్రసంగించారు.

అన్ని ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ ద్యేయంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలని మంత్రి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైద్రాబాద్ కేంద్రంగా అభివృద్ది జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ కారణంగానే ప్రత్యేక వాదం ముందుకు వచ్చిందని జస్టిస్ శ్రీకృష్ణ మకిటీ తేల్చి చెప్పిందని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

also read:శాసనమండలిలో నేడు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు: మరో 14 కీలక బిల్లులు కూడా

అభివృద్ది వికేంద్రీకరణ జరగకపోతే ఒక్క ప్రాంతమే అభివృద్ది అవుతుందన్నారు.  అందుకే అన్ని రాష్ట్రాలు అబివృద్ది వికేంద్రీకరణకు ప్రాధాన్యతను ఇచ్చాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సెక్టార్ కంపెనీలను hyderabadలో  పెట్టారన్నారు. ఇతర రాష్ట్రాలు బీహెచ్ఈఎల్, బీడీఎల్ వంటి పబ్లిక్ సెక్టార్స్ ను రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పెట్టారని మంత్రి తెలిపారు. దీని వల్ల వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ది జరిగిందన్నారు. కానీ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మాత్రం హైద్రాబాద్ లో మాత్రమే అభివృద్ది చోటు చేసుకొందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సెక్టార్ కంపెనీలను hyderabadలో  పెట్టారన్నారు. ఇతర రాష్ట్రాలు బీహెచ్ఈఎల్, బీడీఎల్ వంటి పబ్లిక్ సెక్టార్స్ ను రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పెట్టారని మంత్రి తెలిపారు. దీని వల్ల వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ది జరిగిందన్నారు. కానీ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మాత్రం హైద్రాబాద్ లో మాత్రమే అభివృద్ది చోటు చేసుకొందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఒకే చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతం కూడా అభివృద్ది చెందదని మంత్రి అభిప్రాయపడ్డారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని అధికార వీకేంద్రీకరణకు ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. దీంతో తమ ప్రభుత్వం  నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. చంద్రబాబు సర్కార్  ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో నిపుణులు ఎవరూ లేరని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం పరిపాలన కాకుండా రియల్ ఏస్టేట్ వ్యాపారమే చేయాలని భావించిందన్నారు. 

ఏపీసీఆర్‌డీఏ యాక్ట్‌ను అమరావతి మెట్రోపాలిటిన్ రీజన్ ఏరియాగా మార్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. . జోన్లు, ప్రాంతాలు, నగరాలు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. 
 అయితే ప్రధానంగా రాజకీయాల వల్ల ప్రాంతీయతత్వం కొంతమందిలో రెచ్చగొట్టారు. ఈ ప్రభుత్వం మీద, సీఎం మీద సంపూర్ణ నమ్మకం ఉండటంతో వేరే సబ్జెక్ట్ లేక అమాయకుల్ని రెచ్చగొడుతూ హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వస్తూ నటిస్తున్నారన్నారు.

ఎవరెవరైతే  ఒకశాతమో, రెండు శాతమో వీరి ప్రలోభాలకు లోనైతే వారి ప్రశ్నలకూ సమాధానం చెబుతామని మంత్రి తేల్చి చెప్పారు.  హేతుబద్ధతో సమాధానం చెబుతామన్నారు. పాలసీపై ఒకటికి, రెండు శాతం మందితో చర్చించి 
నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్క రీజియన్ సంతోషంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. ఎంతో ఉదారత్వంతో చట్టాల్ని రద్దు చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.
 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios