శాసనమండలిలో నేడు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు: మరో 14 కీలక బిల్లులు కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ముందుకు మూడు రాజధానుల ఉప సంహరణ బిల్లును ఏపీ ప్రభుత్వం ఇవాళ ప్రవేశ పెట్టనుంది. మరో వైపు ఏపీ రాష్ట్ర శాసనమండలి రద్దు ఉప సంహరణ బిల్లును కూడా ప్రవేశ పెట్టనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ముందుకు మూడు రాజధానుల ఉప సంహరణ బిల్లును ఏపీ సర్కార్ మంగళవారం నాడు ప్రవేశ పెట్టనుంది. నిన్ననే ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లును ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. గతంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయానికి అనుకూలంగా ఈ మేరకు ap cabinet లో తీర్మానం చేశారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నంAp assembly సమావేశాల్లో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు.
also read:ఓటమికి భయపడే.. మూడు రాజధానుల నుంచి వెనక్కి: జగన్ నిర్ణయంపై పవన్ వ్యాఖ్యలు
Three capital cities actఎందుకు తీసుకు రావాల్సి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. మరో వైపు ఈ విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. మరో బిల్లును తీసుకు వస్తామని కూడా ప్రకటించారు. కొత్తగా తీసుకొచ్చే బిల్లులోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఏపీ ప్రభుత్వం ఇవాళ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టనుంది.
శాసన సభ ముందుకు శాసనస మండలి రద్దు ఉప సంహరణ బిల్లు
Ap legislative council ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ గతంలో తీర్మానం చేసింది. ఈ తీర్మానం కాపీని కేంద్రానికి పంపింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఏపీ శాసనమండలి రద్దు కోరుతూ 2020 జనవరి 28న తీర్మానం చేసింది. ఈ తీర్మానం కాపీని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపింది.ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా ఏపీ సీఎం జగన్ గతంలో చర్చించారు. అయితే శాసనమండలి రద్దు విషయమై ఏపీ సీఎం ys jagan పునరాలోచన పడ్డారు.
శాసనమండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఏపీ శాసన మండలి రద్దు ఉపసంహరణ బిల్లును ఏపీ శాసనసభ ముందుకు తీసుకురానుంది జగన్ ప్రభుత్వం. ఈ బిల్లుతో పాటు మరో 14 కీలకమైన బిల్లులను ఏపీ ప్రభుత్వం శాసనమండలి ముందుకు తీసుకు రానుంది. ప్రస్తుతం శాసన మండలిలో tdp బలం 12కి పడిపోయింది. ఈ నెలలో ఎమ్మెల్యే కోటా, వచ్చే నెల 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. దీంతో శాసనమండలిలో ycp బలం 32కి పెరగనుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ శాసనమడలిని రద్దు చేశారు. ఆ తర్వాత 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ శాసనమండలిని పునరుద్దరించారు.అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మండలిని రద్దు చేయాలని నిర్ణయించారు.జ కానీ ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నారు సీఎం జగన్.