ఆ హక్కు పవన్ కి లేదంటున్న బుద్ధా వెంకన్న

budha venkanna comments on pawan kalyan
Highlights

పవన్‌కు దమ్ముంటే ప్రత్యేక హోదాపై మోదీని నిలదీయాలని ఆయన పేర్కొన్నారు. 
 

ఏపీ సీఎం చంద్రబాబుని తన పదవికి రాజీనామా చేయాలని అడిగే హక్కు, అధికారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి లేవని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు.  శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జగన్, పవన్ లపై విరుచుకుపడ్డారు.

జగన్, పవన్ కేంద్రం చెప్పినట్టు చేస్తున్నారని, కేంద్రానికి తొత్తులుగా మారి అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. పవన్‌కు దమ్ముంటే ప్రత్యేక హోదాపై మోదీని నిలదీయాలని ఆయన పేర్కొన్నారు. 

చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం లేదని, ఇక్కడ పోరాటం చేస్తేనే ఢిల్లీ పీఠం కదులుతోందన్నారు. చంద్రబాబును కేంద్రం టార్గెట్ చేస్తోందని, కేంద్రం దయతో ఏపీ ప్రభుత్వం నడవడం లేదని, సోము వీర్రాజు కాకి లెక్కలు చెబుతున్నారని వెంకన్న అన్నారు.

loader