జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీరు ముగ్గురు ఆంధ్రా ద్రోహులుగా తయారయ్యారని ఆరోపించారు.

జీవీఎల్, కన్నా, సోములు ముగ్గురూ వారి కడుపు నింపుకుంటూ.. ప్రజల కడుపు కొడుతున్నారని బుద్ధా విమర్శించారు. ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లి పైరవీలతో అధికారంలో ఉన్న పార్టీలను ప్రసన్నం చేసుకోవడం జీవీఎల్ దినచర్య అని.. అవినీతి కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న కన్నా లక్ష్మీనారాయణ కూడా అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సర్పంచ్‌‌గా కూడా గెలవలేని సోము వీర్రాజు.. తెలుగుదేశం పార్టీ గెలుపొటములపై జోస్యం చెబుతున్నారని వెంకన్న అన్నారు. ఈ ముగ్గురూ ప్రధాని మోడీ మోచేతి నీళ్లు ఏపీ ప్రజలపైనా... ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు మోడీ అన్నారు.