విజయవాడ పశ్చిమ టీడీపీలో మరోసారి ఆసక్తికర పరిణామం..టార్గెట్ కేశినేని నాని..!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరోసారి అక్కడ విజయవాడ ఎంపీ కేశినేని నాని టార్గెట్‌గా.. సొంత పార్టీ నేతలే కీలక వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరోసారి అక్కడ విజయవాడ ఎంపీ కేశినేని నాని టార్గెట్‌గా.. సొంత పార్టీ నేతలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కేశినాని నాని సోదరుడు కేశినేని చిన్ని నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం వేదికగా నిలిచింది. కేశినేని నానికి, ఆయన సోదరుడు చిన్నికి మధ్య విభేదాలు ఉన్నాయి. మరోవైపు కేశినేని నాని, బుద్దా వెంకన్నల మధ్య విభేదాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. అయితే ప్రస్తుతం కేశినేని నాని విజయవాడ పశ్చిమ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అయితే అక్కడే కేశినేని చిన్ని సంక్రాంతి కానుకలు పంపిణీ చేయడం.. దానికి బుద్దా వెంకన్న, నాగులు మీరాలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. 2024 ప్రత్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తెలిపారు. తాను, నాగుల్ మీరా ఇద్దరం ఈసారి చట్ట సభల్లో అడుగుపెడతామని అన్నారు. పార్టీలో ఏ పదవి లేకుండానే కేశినేని చిన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు నాగులు మీరా మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తాను, బుద్దా వెంకన్న మాత్రమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్నామని అన్నారు.
ఇక, కేశినేని నాని కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలుమార్లు టీడీపీ పోటీ చేయకపోయినప్పటికీ.. బుద్దా వెంకన్న, నాగులు మీరా నాయకత్వంలో పార్టీ బలంగా ఉందన్నారు. ఈ సారి ఇక్కడ గెలుపు టీడీపీదేనని చెప్పారు. దీంతో ఈ పరిణామాలు ప్రస్తుతం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి.