అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. విజయసాయిరెడ్డి ఓ దొంగ అంటూ వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన సేవమిత్రల డేటా గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ లో విజయసాయిరెడ్డి అంటే ఎవరికి తెలియదని జైల్ సాయిరెడ్డి అంటేనే అందరికి తెలుస్తుందన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే ఆయన అమరావతిలో ఉండి రాష్ట్రాన్ని పాలించరని హైదరాబాద్ నుంచే పాలిస్తారంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికీ వైఎస్ జగన్ హైదరాబాద్ ను వదల్లేదని వదలరని విమర్శించారు. 

ఇకపోతే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఒక్కో వైసీపీ అభ్యర్థికి రూ.20 కోట్లు పంపించారని ఆరోపించారు. ఇలా మెుత్తం రాష్ట్రంలో రూ.8వేల కోట్లు ఎన్నికలకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్చుపెట్టిందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.