తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు అదేస్థాయిలో కౌంటరిచ్చారు టిడిపి నేత బుద్దా వెంకన్న. చంద్రబాబు అందలమెక్కించిన ఈ పిచ్చికుక్క ఇప్పుడు ఆయనపైనే అరుస్తోందని అన్నారు.
విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu)పై విరుచుకుపడ్డ మంత్రి కొడాలి నాని (kodali nani)కి అదేస్థాయిలో కౌంటరిచ్చారు సీనియర్ నేత బుద్దా వెంకన్న (budda venkanna). మద్యపాన నిషేదాన్ని అమలుచేయకుండా వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం (jangareddigudem)లో కల్తీ సారా తాగి చాలామంది మృతిచెందారని వెంకన్న అన్నారు. అయితే బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళితే మంత్రి కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు వాగాడంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేసారు.
''ముఖ్యమంత్రిగా వున్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆర్ధిక సాయం చేయడం చంద్రబాబు నైజం. అలాంటి నాయకుడి గురించి అసెంబ్లీలో మదమెక్కిన పిచ్చికుక్కలా మంత్రి కొడాలి నాని వాగుతున్నాడు. మంచిమనసుతో చంద్రబాబు చేసిన సాయాన్ని కూడా తప్పు పట్టడానికి నానికి సిగ్గుండాలి. తమ నిర్లక్ష్యం కారణంగా అంతమంది చనిపోతే సాయం చేయాల్సిన ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. కేవలం చంద్రబాబునే కాదు ఆయన సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసి దూషిస్తున్నాడు. ఎక్కడ తన మంత్రి పదవి పోతుందనే భయంతోనే నాని ఇలా వాగుతున్నాడు'' అని వెంకన్న అన్నారు.
''పిచ్చి కుక్కను అందలం ఎక్కించి నాడు చంద్రబాబు తప్పు చేశారు. నువ్వు చంద్రబాబు దగ్గర బిఫాం తీసుకుని గెలవలేదా? ఈనాడు రామోజీరావు, ఏబియన్ రాధాకృష్ణ కాళ్లు మొక్కలేదా? వాళ్ల బూట్లు నాకలేదా? ఎన్నిసార్లు వారికి సాష్టాంగ నమస్కారం చేశావో గుర్తు చేసుకో. ఇలా రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు'' అని మండిపడ్డారు.
''నోరేసుకుని పడితే సీఎం జగన్ మంత్రి పదవి ఉంచుతాడనే భ్రమలో కొడాలి నాని ఉన్నాడు. నువ్వేంట్రా చంద్రబాబు అంతుచూస్తానంటున్నావు... నీకంతా అంత దమ్ముందా. మా నాయకులు లోకేష్, అచ్చెన్నాయుడు లను తిడతావా... అయినా ఎవడ్రా నువ్వు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురైదుగురిని తిడితే జగన్ దగ్గర పేరు వస్తుందనుకుంటున్నాడు'' అని వెంకన్న విరుచుకుపడ్డారు.
''చంద్రబాబుతో కలుస్తామని పవన్ ఎక్కడైనా చెప్పాడా? ప్యాకేజీ ఇవ్వడం నువ్వు చూశావా... లేక దగ్గరుండి ఇప్పించావా?చంద్రబాబు ప్యాకేజీలు ఇచ్చే మనిషి కాదు... పవన్ తీసుకునే వ్యక్తి కాదు. అయినా చంద్రబాబు దగ్గర అంత డబ్బు కూడా లేదు. మీ నాయకుడు, మీలాగా కోట్లు దోచుకోలేదు'' అంటూ నానిపై ఫైర్ అయ్యారు.
''సీఎం జగన్ మళ్లీ ఎమ్మెల్యే సీటిస్తాడు... యాభై కోట్లు ఇస్తాడు...పదివేలతో ఓట్లు కొనాలని చూస్తున్నావు. కానీ డేరా బాబా తరహాలో నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం. నాని నువ్వు 840గాడివి... అది గుర్తుంచుకో. చంద్రబాబు సీటు ఇవ్వకపోతే ఇప్పటికీ గుట్లా ప్యాకెట్లను బస్టాండు, రైల్వేస్టేషన్లలో అమ్ముకునేవాడివి. తల్లి పాలు తాగి, తల్లి రొమ్ము గుద్దే నైజం కొడాలి నానిది'' అని మండిపడ్డారు.
''2014కు ముందు గుట్కాకి కూడా అడుక్కునే నువ్వు వేల కోట్లు ఎలా సంపాదించావు. మంత్రి అయ్యాక రేషన్ లో పందికొక్కులను తరిమేసి... నువ్వే పందికొక్కులాగా దోచుకున్నావు. నీ దోపిడీకి పందికొక్కులు కూడా పారిపోయాయి. పది రోజుల్లో నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతా'' అని బుద్దా హెచ్చరించారు.
''నువ్వు పుట్టిన జాతే నిన్ను అసహ్యించుకుంటుంది. తిట్టుకుందామా లేక కొట్టుకుందామా... దమ్ముంటే రా. ఇళ్లల్లో ఆడవాళ్ల మీద మాట్లాడటం కాదురా... తేల్చుకుందాం రా. గుడివాడ లో నిన్ను ఓడించి తరిమి కొట్టడం ఖాయం. చట్టాలు, న్యాయాలు కూడా నీకు శిక్షలు వేసేందుకు సిద్దంగా ఉన్నాయి. నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి తీహార్ జైలులో పడేస్తాం'' అని హెచ్చరించారు.
''జగన్ మెప్పు కోసం నోటి కొచ్చినట్లు వాగితే మరోసారి నోరెత్తకుండా నీకు బుద్ది చెబుతాం. ఇకనైనా కొడాలి నాని అండ్ కో ఖబర్దార్... ఇకపై వాగుడు ఆపకుంటే మీ భరతం పడతాం'' అని బుద్దా వెంకన్న హెచ్చరించారు.
