ఆయనో ఫినాయిల్ సాయి రెడ్డి .. వైసీపీ నేతపై విరుచుకుపడ్డ బుద్ధ వెంకన్న

ట్విట్టర్లో బాగా యాక్టీవ్ గా ఉండే టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఈ ఇంగ్లీష్ మీడియం విద్యపై మరోమారు విరుచుకుపడ్డారు. ఈ విషయమై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమ్శలు చేసారు. 

budda venkanna calls vijayasai reddy as phenyl sai reddy

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం విద్యపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చుట్టూ చెలరేగుతున్న దుమారం ఇప్పుడప్పుడు సమసిపోయేదిగా కనపడడం లేదు. అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు ఈ విషయంలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. 

ట్విట్టర్లో బాగా యాక్టీవ్ గా ఉండే టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఈ ఇంగ్లీష్ మీడియం విద్యపై మరోమారు విరుచుకుపడ్డారు. ఈ విషయమై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమ్శలు చేసారు. 

విజయసాయి రెడ్డి డైరెక్షన్‌లోనే జగన్ ఇంగ్లీష్ పాట అందుకున్నారని ఆరోపించారు. ఎందుకింత తెగులు.. తెలుగును విస్మరిస్తారా? అంటూ తెలుగు కోసం పోరాటం చేసిన జగన్.. ఇప్పుడు నాలుకను మడతేసి ఇంగ్లీష్ ఉద్యమం చేస్తున్నారని ఆక్షేపించారు. 

మీ ఫినాయిల్ పత్రిక, ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగుని చంపేస్తారా? అని రాసిన రాతలు మర్చిపోయారా అని అన్నారు. అప్పుడు అవన్నీ మీ డైరెక్షన్లోనే జరిగాయి కదా ఫినాయిల్ సాయిరెడ్డిగారూ అని విజయసాయి రెడ్డి ని సంబోధిస్తూ ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న ఘాటు విమర్శలు గుప్పించారు. 

ఇదే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి విధానంపై జనసేనాని కూడా తీవ్ర విమర్శలే చేస్తున్నారు. గతంలో ఆయన మా తెలుగుతల్లిని కాపాడాల్సిన మీరే తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు అంటూ జగన్ పై మండిపడ్డారు. 

తెలుగు భాషా సరస్వతిని అవమానించకండి అంటూ హితవు పలికారు. ఇంగ్లీష్ భాషను వద్దని ఎవరూ చెప్పడం లేదని తెలుగు మాతృ భాష పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వైసీపీ నాయకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి స్పష్టం చేయాలని తెలిపారు. 

మాతృభాషని,  మాండలికాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాస్ముర తత్వాన్ని సూచిస్తుందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. 

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టింది. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతూ కేబినెట్ తీర్మాణం చేసింది. అందుకు సంబంధించి ఒక ఐఏఎస్ అధికారిని సైతం నియమించింది. 

  అలాగే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూనే తెలుగు సబ్జెక్టు కంపల్సరీ అంటూ సీఎం వైయస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనాటి నుంచి ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగుభాషను చంపేస్తున్నారంటూ ఆరోపిస్తున్న సంగంతి తెలిసిందే.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios