సీనియర్ల వేధింపులకు బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 14, Aug 2018, 12:37 PM IST
Btech student suicide for seniors harassement
Highlights

అనంతపురం జిల్లాలో సీనియర్ల వేధింపులకు ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. మదనపల్లిలో ఓ ప్రవేట్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న ప్రియాంకను సీనియర్లు వేధింపులకు గురిచేశారు. 

అనంతపురం:
అనంతపురం జిల్లాలో సీనియర్ల వేధింపులకు ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. మదనపల్లిలో ఓ ప్రవేట్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న ప్రియాంకను సీనియర్లు వేధింపులకు గురిచేశారు. సీనియర్ల వేధింపులపై ప్రియాంక కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. 

ప్రిన్సిపాల్ ప్రియాంక ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేస్తావా అంటూ సీనియర్స్ సోమవారం బస్సులో బెదిరింపులకు పాల్పడటంతో మనస్థాపం చెందిన ప్రియాంక ఆత్మకు పాల్పడింది. ప్రియాంక ఆత్మహత్యకు కారణమైన సీనియర్లపైనా....ఫిర్యాదు పట్టించుకోని కళాశాల యాజమాన్యం పైనా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

loader