విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నల్గొండ జిల్లా  మిర్యాలగూడ కు చెందిన యశ్వంత్ రెడ్డిగా గుర్తించారు. కళాశాలలోని ఎనిమిదో అంతస్తు మీద నుంచి దూకి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.

విజయవాడ నగరానికి సమీపంలోని వడ్డేశ్వరంలోని వున్న కేఎల్ యూనివర్సిటీలో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలోని ఎనిమిదో అంతస్తు మీద నుంచి దూకి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన యశ్వంత్ రెడ్డిగా గుర్తించారు. ఇతను సీఎస్ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వెంటనే స్పందించిన కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థి మృతదేహాన్ని గోప్యంగా మణిపాల్ మార్చురీకి తరలించింది. విషయం తెలుసుకున్న యశ్వంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతని బంధువులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యశ్వంత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred