గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై అర్థరాత్రి కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. అతడి మర్మాంగాన్ని కత్తితో కోసి అతి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం సిరంగిపాలెం గ్రామంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. గాడ నిద్రలో వున్న అతడిపై కత్తులతో దాడికి దిగారు. అంతేకాకుండా అతడి మర్మాంగాన్ని కోసి పరారయ్యారు.

దుండగుల శరీరంలోని సున్నితమైనఅవయవాన్ని కోసేయడం, తీవ్ర రక్తస్రావం అవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఈ దారుణానికి పాల్పడిన దుండగులకోసం గాలింపు చేపట్టారు.