Asianet News TeluguAsianet News Telugu

అక్కను చంపి, దుపట్లో మూటగట్టి.. టూ వీలర్ మీద ఊరంతా తిరిగి.. చివరికి...

సోదరుడు అక్క మృతదేహాన్ని మూటగట్టి టూ వీలర్ మీద ఊరంతా చక్కర్లు కొట్టాడు. చివరకు గ్రామ శివరులోని బావిలో పడేసి చేతులు దులుపుకున్నాడు. 

brother thrown sisters dead body into a well in chittoor - bsb
Author
Hyderabad, First Published Jun 21, 2021, 10:12 AM IST

కట్టుకున్న భర్త విడిచిపెట్టాడు. కన్న తల్లిదండ్రులు దూరమయ్యారు. నా అన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆ మహిళ ఆదరువు కోసం తమ్ముడి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. సోదరుడు అక్క మృతదేహాన్ని మూటగట్టి టూ వీలర్ మీద ఊరంతా చక్కర్లు కొట్టాడు. చివరకు గ్రామ శివరులోని బావిలో పడేసి చేతులు దులుపుకున్నాడు. 

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం ఎ.రంగపేటకు చెందిన మహేష్, తులసీ దంపతులు కూలి పనులు చేసకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఏర్పేడు మండలం ఇసుకతాగేళికి చెందిన గురవయ్యతో మహేష్ సోదరి మహేశ్వరి(45)కి వివాహం జరిపించారు.

విభేదాలతో భర్తకు దూరమైన మహేశ్వరి రెండేళ్ల కిందట అన్న ఇంటికి చేరింది. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు సోదరి పోషణ భారంగా మారిందని భావించిన మహేష్ మదనపడుతూ మద్యానికి బానిసయ్యాడు.తమ జీవితానికి అడ్డుగా వచ్చిందని భావించిన తులసి తరచూ మహేశ్వరిని వేధించేది. ఈ క్రమంలో శనివారం స్నానాల గదిలో కిందపడి మహేశ్వరి చనిపోయిందని తులసి తన భర్తకు సమాచారమిచ్చింది. 

మహేష్ ఇంటికి చేరుకుని ఈ విషయాన్ని బంధువులకు తెలిపే ప్రయత్నం చేయగా, ‘అందరికీ చెబితే గొడవలు చేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా కరోనాతో చనిపోయిందని నమ్మించి, గ్రామ శివారులోని అడవిలో పూడ్చేద్దాం’ అని తులసి భర్తకు సలమా ఇచ్చింది.

అమరావతిపై జగన్ కు రఘురామ కృష్ణంరాజు లేఖ: మూడు రాజధానులపై విస్మయం...

దీంతో మహేష్ తన స్నేహితుడి సాయంతో అర్థరాత్రి దాటిన తరువాత మృతదేమాన్ని దుప్పటిలో మూట గట్టాడు. అనంతరం ఎక్కడ ఖననం చేయాలో తెలియక ద్విచక్రవాహనం మీద ఊరంతా తిప్పారు. చివరకు నారావారిపల్లికి వెళ్లే దారిలోని ఓ బావిలో పడేశారు. ఇదే సమయంలో అక్కడే గస్తీ నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బంది వారిని గుర్తించి ప్రశ్నించారు.

పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న తులసి ఇంటికి తాళం వేసి పరారయ్యింది. చంద్రగిరి సీఐ రామచంద్రారెడ్డి, ఎస్సై చిన్నరెడ్డెప్ప స్నానాల గదిని పరిశీలించారు. ఎక్కడా రక్తం మరకలు లేకపోవడంతో తులసి కోసం గాలిస్తున్నారు. మృతురాలి భర్త గురవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios