Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశంలో దారుణం: ఆస్తికోసం చెల్లిని చంపిన అన్న

కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే కాలయముడయ్యాడు. ఆస్థికోసం చెల్లెల్లను మట్టుబెట్టాడు. కేవలం ఏడు సెంట్ల భూమికోసం చెల్లి ప్రాణం తీసిన అతగాడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో చోటు చేసుకుంది. 
 

Brother killed sister due to land issues in prakasam district
Author
Prakasam, First Published Oct 3, 2018, 2:47 PM IST

ప్రకాశం: కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే కాలయముడయ్యాడు. ఆస్థికోసం చెల్లెల్లను మట్టుబెట్టాడు. కేవలం ఏడు సెంట్ల భూమికోసం చెల్లి ప్రాణం తీసిన అతగాడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే కారంచేడు మండలం స్వర్ణ గ్రామం ఉత్తర బజారుకు చెందిన సుకంల పద్మావతికి ఈ ఏడాది మార్చిలో బేస్తవారిపేట మండలం రెట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణతో వివాహం జరిగింది. వెంకట రమణ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. దీంతో వివాహం అనంతరం దంపతులు హైదరాబాద్ లో నివశిస్తున్నారు. అక్టోబర్ 1న హైదరాబాద్ నుంచి సొంతూరికి పద్మావతి వచ్చింది. 

అయితే తల్లికి వస్తువులు కొనిద్దామని బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా వరుసకు సోదరుడైన శింగయ్య శివాలయం దగ్గర మాటు వేసి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. బజారు నుంచి వస్తున్న పద్మావతి తలను గోడకు బలంగా కొట్టాడు. ఆ తర్వాత ఛాతి భాగంలో కత్తితో బలంగా పొడిచి శింగయ్య పరారయ్యారు.  

మృతురాలి తల్లి వెంకాయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడుని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు పద్మావతి గతంలో నేషనల్ యువజన కేంద్రీయ విద్యలో ఉద్యోగం చేసిందని అందులో భాగంగా అక్టోబర్ 2న రివార్డు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. రివార్డు కోసం స్వగ్రామానికి వచ్చిందని ఆమె వస్తుందని తెలుసుకున్న శింగయ్య పథకం ప్రకారం ప్లాన్ చేసి హత్య చేసినట్లు తెలిపారు. 

పద్మావతి హత్యకు ఆస్థితగాదాలే కారణమని పోలీసులు నిర్థారించారు. తాతల కాలం నుంచి వస్తున్న కేవలం 7 సెంట్ల భూమే వివాదానికి కారణంటున్నారు. ఆ భూమిపై కన్నేసిన పద్మావతి పెదనాన్న కుమారుడు శింగయ్య పద్మావతిని హత్య చేసి భూమిని స్వాధీనం చేసుకుందామని ప్రయత్నించాడని తెలిపారు. 

పద్మావతికి ముగ్గురు అక్కలు ఉన్నారు. ఈ ఏడు సెంట్ల భూమి నలుగురు పంచుకోవాల్సి ఉంది. అయతే ఆ భూమిపై పెదనాన్న కొడుకు శింగయ్య ఎప్పటి నుంచో కన్నేశాడు. ఆ భూమిని స్వాధీనం చేసుకుందామని ప్రయత్నించడంతో గతంలో గొడవలు కూడా జరిగాయి. 

అయితే అక్కలందరి కంటే తెలివిగా ఉండే పద్మావతి గొడవలను ధీటుగా ఎదుర్కొనేది. తెలివైన పద్మావతి అడ్డంకిని తొలగించుకుంటే మిగిలిన వాళ్లు భయపడి తనకు ఎదురురారని నిందితుడి భావించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 తన కుమార్తెను హత్య చేసిన శింగయ్యను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు ఎస్ రాధాకృష్ణమూర్తి, వెంకాయమ్మ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ భూమిని కాజేసేందుకు శింగయ్య ప్రయత్నిస్తున్నాడని అతని వల్ల తమకు ప్రాణ హాని ఉందని అక్కలు శివకుమారి, విజయలక్ష్మీలు బోరున విలపిస్తున్నారు. తమ చెల్లిని చంపేసిన శింగయ్య తమను కూడా చంపేస్తాడని భయంగా ఉందని పోలీసులకు తెలిపారు.  

 హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని చీరాల సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు. పద్మావతి హత్యకు గురైందన్న విషయాన్నిహైదరాబాద్ లోని భర్తకు తెలియజేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios