వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్ గెలుస్తాడని అతని బావ, పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్  అన్నారు.  విశాఖ ఐటీఐ జంక్షన్ లో మంగళవారం బ్రదర్ అనీల్ కుమార్ అధ్యక్షతన చర్చిలో ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా బ్రదర్ అనీల్ కుమార్ మాట్లాడారు.  దేవుడు నీతిమంతుల పక్షాన ఉన్నాడన్నారు.. జగన్ పక్షానే దేవుడు ఉన్నారన్నారు. ఈ ప్రార్థనల్లో స్థానిక వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు.

వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన బాటలోనే జగన్ కూడా నడుస్తున్నారన్నారు.

వైఎస్ఆర్ పై సెక్రటేరియట్ లో హత్యాయత్నం జరిగిన సమయంలో, నక్సలైట్లు బాంబు పెట్టిన సమయంలోనూ దేవుడే కాపాడారని ఆమె అన్నారు. నా జీవితంలో 52 ఏళ్ల జీవితం ఒక ఎత్తయితే..వైఎస్ మరణం తర్వాత 9ఏళ్లు మరో ఎత్తు అన్నారు.

ఈ 9ఏళ్లు అనేక  కష్టాలతో గడించిందన్నారు.  ఎన్నో కుట్రాలు, కేసులు, గొడవలతో ఇబ్బందులు పెట్టినా జగన్ వెనక్కి తగ్గలేదన్నారు. వైఎస్ లో ఉన్న తపన జగన్ లో నిండుగా ఉందన్నారు. 14నెలలుగా పాదయాత్ర చేసిన జగన్ కి దేవుడు అండగా నిలిచాడన్నారు.