కాళ్ల పారాణి ఆరకముందే నవ వరుడు ఆత్మహత్య

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 4, Sep 2018, 8:55 PM IST
Bride groom suicide in vizianagaram district
Highlights

 విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందే నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. మరికాసేపట్లో రిసెప్షన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో వరుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది.

విజయనగరం: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందే నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. మరికాసేపట్లో రిసెప్షన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో వరుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. 

వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా బాబామెట్ట ప్రాంతానికి చెందిన మదీనా అనే యువకుడు సాలూరుకు చెందిన ముబీనాతో ఈనెల 2న వివాహం అయ్యింది. అప్పటి నుంచి పెళ్లికుమార్తె ఇంట్లో వేడుకలు నిర్వహించారు. అయితే మంగళవారం సాయంత్రం వరుడి స్వగృహంలో వేడుకలు నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 

వరుడి స్వగృహానికి అప్పటికే బంధువులు ఒక్కొక్కరిగా వస్తున్నారు. పెళ్లి కుమార్తె ఆమె బంధువులు సైతం పయనమవుతున్నారు. మరికొద్ది గంటల్లోనే రిసెప్షన్ లో సందడి చెయ్యాల్సిన వరుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు చూసి మదీనాని కిందకు దించేలోపే చనిపోయాడు. దీంతో ఇరు కుటుంబంలో విషాదం నెలకొంది. 

వరుడు మదీనా చీపురుపల్లి మండలం పెదనడిపల్లిలో వీఆర్వోగా పనిచేస్తున్నాడు. మదీనా ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. అమ్మాయిని ఇష్టపడే మదీనా పెళ్లికి ఒప్పుకున్నారని అమ్మాయి తరపు బంధువులు చెప్తున్నారు. అయితే పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూపించారని పెళ్లి వేరొక అమ్మాయితో చెయ్యడంతో తట్టుకోలేక మదీనా ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

loader