Breaking News : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబునాయడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

అమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తరఫు లాయర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆగస్ట్ 9న స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు నాయుడు ఉన్నారు. అక్టోబర్ 31న ఆరోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు విడుదలయ్యారు.
ఈ మేరకు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పునిచ్చారు. మధ్యంతర బెయిలు సమయంలో విధించిన షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయని తెలిపారు. ఏసీబీ కోర్టు ముందు ఈనెల 23వ తారీఖున చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టులో చికిత్సకు సంబంధించిన నివేదికను అందించాలని తెలిపారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థలూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. కాగా సిఐడి తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మీద ఇరువర్గాలు చేసిన వాదనలు ఈ నెల 17వ తేదీన ముగిసాయి. ఆ సమయంలో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సోమవారం మధ్యాహ్నం బెయిలు మంజూరు చేస్తూ తీర్పిచ్చింది.