సోషల్ మీడియా పరిచయం ప్రేమకు, ఆ తరువాత రహస్యంగా పెళ్లికి దారి తీసింది. చివరికి మోసపోవడం యువతి వంతయ్యింది. కర్నూలులో జరిగిన ఈ ఘటనలో యువతి నగలతో యువకుడు ఉడాయించాడు. వివరాల్లోకి వెడితే...

సోషల్ మీడియా పరిచయం ప్రేమకు, ఆ తరువాత రహస్యంగా పెళ్లికి దారి తీసింది. చివరికి మోసపోవడం యువతి వంతయ్యింది. కర్నూలులో జరిగిన ఈ ఘటనలో యువతి నగలతో యువకుడు ఉడాయించాడు. వివరాల్లోకి వెడితే...

హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న ఓ యువతికి సోషల్ మీడియాలో సందీప్ అనే యువకుడితో పరిచయమైంది. తమది జగిత్యాల అని చెప్పిన సందీప్.. తాను కూడా హోటల్‌లో పనిచేస్తున్నట్లు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. 

వారిద్దరి మధ్య ఈ పరిచయం కాస్తా ప్రేమగ మారింది. రెండునెల్లలోనే పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడు సందీప్. అయితే తమ ఇంట్లో ఒప్పుకోవడం లేదని కాబట్టి ఎక్కడికైనా వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకుందామని యువతిని ఒప్పించాడు. 

నిజమేనని నమ్మిన యువతి సందీప్ తో గద్వాల్ జిల్లా ఆలంపూర్‌లో రహస్యంగా వివాహం చేసుకుంది. అక్కడి నుంచి సందీప్ కర్నూలు తీసుకెళ్లాడు. బళ్లారి చౌరస్తాలోని ఓ హోటల్‌లో దిగారు. ఈ నెల 7వ తేదీన యువతి స్నానానికి వెళ్లిన సమయంలో ఆమె నగలు, రెండు లక్షల నగదుతో ఉడాయించాడు. 

మెడలో తాళి కట్టి ఆమెను పూర్తిగా నమ్మించి నట్టేట ముంచేశాడు. సందీప్ తిరిగొస్తాడని ఎదురుచూసి.. ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి కర్నూలు పోలీసులను ఆశ్రయించింది.