Asianet News TeluguAsianet News Telugu

బొత్స సత్యనారాయణ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

Botsa Satyanarayana Biography: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. బలమైన ప్రజా మద్దతుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలం చేసుకున్న నేత. ఎలాంటి వివాదాన్నినైనా సామరస్యంగా పరిష్కరించగల లీడర్. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసమే పరితపించే ప్రజా నాయకుడు. ఆయన మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

Botsa Satyanarayana Biography, Age, Caste, Children, Family, Political Career KRJ
Author
First Published Mar 21, 2024, 12:31 AM IST

Botsa Satyanarayana Biography: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. బలమైన ప్రజా మద్దతుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలం చేసుకున్న నేత. ఎలాంటి వివాదాన్నినైనా సామరస్యంగా పరిష్కరించగల లీడర్. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసమే పరితపించే ప్రజా నాయకుడు. ఆయన మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

వ్యక్తిగత జీవితం

బొత్స సత్యనారాయణ.. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరంలో బొత్స గురునాయుడు- ఈశ్వరమ్మ దంపతులకు 1958లో జన్మించారు. ఆయన మహారాజా కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన 1985లో బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.ఒక అబ్బాయి( సందీప్ ), ఒక అమ్మాయి (అనూష ). సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నరసయ్య వైఎస్ఆర్సీపీ నాయకుడు.

రాజకీయ జీవితం 

బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం విద్యార్థి దశ నుండే ప్రారంభమైందని చెప్పాలి. 1978లో విద్యార్థి సంఘ నాయకుడుగా రాజకీయం మొదలుపెట్టి అంచలంచలుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా ఎదిగారు. ఆయన 1992 నుంచి 99 వరకు రెండుసార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్  పనిచేస్తారు. ఆ తరువాత 1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఏమాత్రం కుంగుబాటుకు లోను కాకుండా..  1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. 

ఆనాడు ఎన్డీఏ హవా వల్ల  కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ నుండి కేవలం 5 ఎంపీలని గెలుచుకోగా అందులో బొత్స ఒకరు. 2004, 2009 లలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత బొత్స పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది.ఆయన వైఎస్ఆర్, రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2012 నుంచి 2015 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తారు. 

వైసీపీలో చేరిక 

అయితే.. రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలతో 2014లో ఓడిపోయారు. దీంతో 2015 లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బొత్స సత్యనారాయణ, మద్దతుదారులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్‌ లో చేరారు. 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్ లో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఇలా వైయస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ మొత్తం నలుగురు ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన ఘనత బొత్సకే దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios