జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. పవన్ వ్యాఖ్యలు చేసే ముందు కాస్త వెనుకా ముందు చూసుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలంటే ఏదో సినిమా అనుకుంటున్నారని విమర్శించారు.  

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. పవన్ వ్యాఖ్యలు చేసే ముందు కాస్త వెనుకా ముందు చూసుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలంటే ఏదో సినిమా అనుకుంటున్నారని విమర్శించారు. 

పవన్ రాజకీయాలు వేరు సినిమా వేరు అని గుర్తుంచుకోవాలని సూచించారు. జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ అది మంచిది కాదని హితవు పలికారు. ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు దానికొక హేతుబద్దత ఉండాలని హితవు పలికారు. జగన్ పై పవన్ చేస్తున్ ఆరోపణలు అన్నీ నిరాధారణమైనవని బొత్స కొట్టిపారేశారు.

మరోవైపు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. దొంగలను కాపాడేందుకు చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ తో పొత్తు ప్రతిపాదనపై టీడీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దోపిడీ దొంగలుకు ఏపీ కేంద్రంగా మారబోతుందంటూ బొత్స ఆరోపించారు.